ఏపీ సీఎస్ నేతృత్వంలో కీలక భేటీ

-

ఆంధ్ర ప్రదేశ్ సీఎస్ నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. శాసన రాజధానికి సంబంధించిన అసంపూర్తి భవనాల నిర్మాణంపై చర్చ జరిగినట్టు చెబుతున్నారు. సీఎస్ నేతృత్వంలో నిన్ననే తొమ్మిది మంది సభ్యులతో ప్రభుత్వం కమిటీ వేసింది. రాజధాని ప్రాంతంలోని అసంపూర్తి భవనాల నిర్మాణానికి నిధుల అంచనాపై సమీక్ష అవసరమని పేర్కొన్నారు. ఏయే భవనాలు అవసరం.. ఏయే భవనాలు అనవసరం అనే జాబితాను సీఎస్ నేతృత్వంలోని కమిటీ సిద్జం చేయనుంది.

  శాసన రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేయాలని జగన్ సర్కార్ భావిస్తూ, సెక్రటేరీయేట్, హోచ్వోడీ, శాశ్వత హైకోర్టు భవన నిర్మాణాల కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఏఎమ్మార్డీఏ కమిషనర్ కోరారు. దీంతో శాసన రాజధానికి అవసరమైన భవనాలు, హౌసింగ్ యూనిట్ల నిర్మాణం.. ఖర్చు తగ్గించుకునేలా సీఎస్ నేతృత్వంలోని కమిటీ ప్రణాళికల రూపకల్పనపై అధ్యయనం చేయనుంది. కమిటీలో సభ్యులుగా అసెంబ్లీ కార్యదర్శి, ఎమ్మార్డీఏ కమిషనర్ సహ జీఏడీ, పట్టణాభివృద్ధి, న్యాయ, ఆర్థిక, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news