ఏపీ సర్కార్‌కు ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం తీసుకున్నారు.
సీపీఎస్ రద్దు చేయాలనే డిమాండుతో మిలీనియం మార్చ్ చేపట్టాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1న విజయవాడలో మిలీనియం మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 4లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులతో మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఇక పై కలసి ఉద్యమం చేయాలని సీపీఎస్ పై పోరాడుతోన్న రెండు ప్రధాన ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఎపీసీపీఎస్ఈఎ, ఎపీసీపీఎస్ యూఎస్ కలసి పోరాటం చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా చత్తీస్ ఘడ్, రాజస్థాన్ సీఎం ఫొటోలకు పాలాభిషేకం చేసిన సీపీఎస్ ఉద్యోగులు… వారి తరహాలో సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలన్నారు.