తెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..

-

సంవత్సరంలో మే నెల వచ్చింది అంటే విద్యార్థులు చాలా బిజిగా ఉంటారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ చదివే వారంతా కూడా బిజీగా ఉంటారు..ఒకవైపు స్కూల్స్ కు ఎగ్జామ్స్, మరోవైపు సమ్మర్ హాలిడేస్.. అదే విధంగా ఎగ్జామ్స్ కూడా పిల్లలను బాగా ఇబ్బంది పెడతాయి. ఏడాది మొత్తం చదివిన దానికన్నా ఎగ్జామ్స్ టైం లో మాత్రం పిల్లలు చాలా టెన్షన్ పడతారు..ఇప్పటికే ఇంటర్ పరీక్షలు దేశ వ్యాప్తంగా మొదలైయ్యాయి..మరి కొద్ది రోజుల్లో ముగియనున్నాయి..ఇక టెన్త్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.

 

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది. విద్యార్థులు అధిక మార్కుల తో ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తుంది.ఇప్పటికే ఎన్నో రకాలుగా విద్యార్థులను మోటివేట్ చేస్తున్న సర్కార్ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను టెన్త్ విద్యార్థులకు అందించింది..రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23 న పది పరీక్షలు జరగునున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ సేన విద్యార్థుల సందెహాలను తీర్చారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ దూరదర్శన్ లో ఫోన్ ఇన్ కార్యక్రామాన్ని నిర్వహించారు..ఈ కార్య క్రమంలో భాగంగా చాలా మంది విద్యార్థులు నేరుగా ఆమె తో మాట్లాడి సందెహాలను నివృత్తి చేసుకున్నారు.. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మరో వారం కూడా పరీక్షల ముందు ఎలా ఉండాలి,పరీక్షల సమయంలో ఎలా ఉండాలి అనే అంశాల మీద మాట్లాడ నున్నారని సమాచారం.కరోనా తర్వాత విద్యార్థుల రాయనున్న పరీక్షలు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news