కేంద్ర ప్రభుత్వం కన్నా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్ర నాయకత్వం సమర్ధుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉందని అన్నారు. రాష్ట్రాల అప్పుల పై మాట్లాడుతున్న కేంద్రం అప్పుల సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. కేంద్రం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు విజయసాయి. కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
సేస్, సర్చార్జ్ రూపంలో పన్నులు వసూలు చేసి.. రాష్ట్రాల వాటా ఎగ్గొట్టారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 2021-22 వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 57% జిడిపి రేషియో ఉందని.. అదే పంజాబ్ రాష్ట్రం జిడిపి తీసుకుంటే 47% ఉందని అన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ జిడిపి 32% ఉందని అన్నారు విజయసాయి. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉందని, ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా లేదని అన్నారు.