బ్యాంకు ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో పని చేసేటు వంటి బ్యాంకు ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. వినాయక చవితి రోజు బ్యాంకు ఉద్యోగులకు సెలవు ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల తరహా లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో కూడా ఈ నెల 10 వ తేదీన సెలవు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది UFBU.

banks

అయితే.. UFBU అభ్యర్ధనను పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. సెలవు ప్రకటించింది.  NI ఆక్ట్ ప్రకారం గా వినాయక చవితి కి సెలవు ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యం లో హర్షం వ్యక్తం చేశారు బ్యాంకు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు. ఇక మొన్నటి వరకు బ్యాంకు ఉద్యోగులకు వినాయక చవితి పండుగకు సెలవు ఇవ్వబోమని చెప్పింది ప్రభుత్వం. కానీ… చివరకు UFBU అభ్యర్ధన మేరకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది.