స్టాలిన్‌ మరో సంచలన నిర్ణయం.. ప్రజల కోసం ప్రత్యేక బిల్లు

తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్… తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరూ ఊహించని విధంగా తన పాలనను కొనసాగిస్తున్నారు. ఎవరి అంచనాలకు అందని నిర్ణయాలతో… ప్రజల్లో తన క్రేజ్‌ ను పెంచుకుంటున్నారు సీఎం స్టాలిన్‌. అయితే.. ఈ సంచలన నిర్ణయాలతో దూసుకెళుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రజలకు ఆలస్యం లేకుండా ఓ నిర్దిష్ట సమయానికి ప్రభుత్వ సేవలు పొందేందుకు ” రైట్‌ టు సర్వీస్‌ యాక్ట్‌” అనే బిల్లు తీసుకు రానున్నారు. ఈ మేరకు సీఎం స్టాలిన్‌ కీలక ప్రకటన చేశారు. దీని వల్ల ప్రభుత్వ కార్యాలాయా ల్లో సేవలు పొందేందుకు ప్రజలు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన బాధలు తప్పనున్నాయి. అంతేకాదు.. ఈ బిల్లు వల్ల ప్రజలకు సరైన న్యాయం జరుగనుంది. ప్రస్తుతం తమిళనాడు సర్కార్‌ ఈ బిల్లు రూపొందించే పనిలో ఉంది. దీని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని కూడా నిర్వహించే దిశగా ఆలోచన చేస్తోంది స్టాలిన్‌ సర్కార్‌.