ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక

-

దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం దసరా పండుగ ముందు ఒక డీఏను శనివారం విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

CM to launch YSR Cheyutha in Yemmiganur on Oct 19

ఈ డీఏను 2022 జులై 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఉద్యోగుల సంఘం నేతలు కలిసి డీఏ విడుదల చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారు. అగస్ట్ 2న విజయవాడలో జరిగిన ఏపీఎన్జీవో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ డీఏ ఇస్తామని ప్రకటించారు. దసరాకు రెండు రోజుల ముందు ఇప్పుడు డీఏ విడుదల చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news