వాక్సిన్ పై అన్నంత పని చేసిన జగన్ సర్కార్

-

కరోనా వాక్సిన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నంత పని చేసింది. కోవిడ్ 19 వాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన ప్రభుత్వం… షార్ట్ టెండర్ నోటుఫికేషన్ జారీ చేసింది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10 మిలియన్ డోసుల వాక్సిన్ను ప్రభుత్వం సేకరిస్తుంది. బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీ గా ఆశ్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 6 నెలల్లో 10 మిలియన్ డోసుల వాక్సిన్ను సరఫరా చేయాలని కండిషన్ పెట్టింది.

సప్లయర్ నెలకు 1.5 మిలియన్ డోసులు విధిగా సప్లై చేయాల్సి ఉంటుంది అని ఏపీ సర్కార్ పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల మందికి వాక్సిన్ వేయాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం… వాక్సిన్ కి సంబంధించి కేంద్రం మీద ఆధారపడవద్దు అని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news