బ్రేకింగ్: ఏపీలో మరో రెండు వారాలు కర్ఫ్యూ…?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అదుపులోకి రావడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా సరే సాధ్యం కావడం లేదు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో లాక్ డౌన్ తరహా కర్ఫ్యూ ని అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. కరోనా కేసులను కట్టడి చేయడానికి ఇది ఉపయోగపడుతుందనే భావనలో ఏపీ ప్రభుత్వం ఉంది.

ఫీవర్ సర్వే లో కూడా భారీగా జ్వరాలు కనపడటంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. అందుకే ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ ని మరోసారి పెంచే ఆలోచనలో ఉందని సమాచారం. రెండు వారాల పాటు కర్ఫ్యూ ని పెంచేందుకు సిఎం వైఎస్ జగన్ సిద్దమయ్యారని తెలుస్తుంది. ఎల్లుండి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయనుంది.