ఎస్​ఈబీను ప్రత్యేక విభాగంగా ఏపీ ప్రభుత్వం గుర్తింపు.. ఉత్తర్వులు జారీ

-

మద్యం, ఇసుక అక్రమ రవాణాల నియంత్రణపై ఏర్పాటైన ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోను ప్రత్యేక విభాగంగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈబీ కమిషనర్​ను విభాగాధిపతిగా పేర్కొంటూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు డీజీపీ, ప్రభుత్వ ఎక్స్​అఫీషియో కార్యదర్శి హోదాలో గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.నిధుల వినియోగానికి సంబంధించి సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఎస్ఈబీకి ప్రత్యేక విభాగం హోదా ఇస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు.

ap
ap

సాధారణ పరిపాలన శాఖలో భాగంగా ప్రభుత్వం ఎస్ఈబీని ఏర్పాటు చేసింది.ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్​కి ఛైర్మన్, ఎండీలను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీజీఐసీఎల్​కు ఛైర్మన్​గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్​రావత్, ఎండీగా ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవీవీ సత్యనారాయణను నామినేట్ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news