రాజస్థాన్ 10 వ తరగతి ఫలితాలను ఆర్‌బిఎస్‌ఇ బోర్డు విడుదల చేసింది. 11.79 లక్షలకు పైగా (11,79,830) విద్యార్థులు పరీక్షలు రాయగా 9,29,045 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం 79.85 ఉండగా ఈసంవత్సరం 80.63 శాతానికి పెరిగింది. పరీక్ష ఫలితాలు rajeduboard.rajasthan.gov.in మరియు rajresults.nic వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు.
కాగా కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా మార్ఛ్‌లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. సాంఘీక శాస్త్రము, సామాన్య శాస్త్రము, గణిత పరీక్షలు వాయిదా వేశారు. మళ్ళీ వాయిదా పడ్డ పరీక్షలను జూన్‌లో నిర్వహించారు.