ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. కరోనా తీవ్రతను కట్టడి చేయడానికి గానూ… మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే మాత్రం ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం ఆరు నెలల పాటు జైలుకు పంపించడంతో పాటుగా రూ. వెయ్యి జరిమానా విధించే ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

మినహాయింపు ఉన్న సేవలు తప్ప మిగతావన్నీ ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 1897 అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జీఓ ఆర్టీ నంబరు 209 ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆదేశాల ప్రకారం ఈ నెల 31 వరకూ రాష్ట్ర మంతటా లాక్‌ డౌన్‌ ప్రకటించింది. అంతర్రాష్ట్ర రవాణా సేవలు సహా ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా రద్దు ప్రకటించింది. సరిహద్దులను పూర్తిగా మూసి వేసింది.

వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం మూడు అడుగుల దూరం (సోషల్‌ డిస్టెన్స్‌) విధిగా పాటించాలని, బహిరంగ ప్రదేశాలలో 10 మందికి మించి గుమిగూడటాన్ని నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల అమలు, పర్యవేక్షణ అధికారాన్ని జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, డీఎం అండ్‌ హెచ్‌ఓలు, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలకు కట్టబెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news