ఆలయాల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు దేవాలయాలలో విగ్రహాలు ధ్వంసం ఘటనలు ఎక్కువైపోయాయి. ఎప్పుడు ఏ ఆలయంలో విగ్రహం ధ్వంసం అయింది అనే వార్త వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ దేవాలయాల్లో వరుస ఘటనలు నివారణ కోసం ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆలయాల ఘటనల నివారణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ రోజు దేవాదాయ, పోలీసు ఉన్నతాధికారులతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి భేటీ అవుతున్నారు. ప్రతి దేవాలయంలో సెక్యూరిటీ నియామకంపై సాధ్యాసాధ్యాలను ఈ భేటీలో పరిశీలించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో పక్క ఏపీలో మరో విగ్రహం ద్వంసం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లలో బుద్ధుడి విగ్రహం ద్వంసం అయిందని వార్తలు వస్తున్నాయి.