షాకింగ్‌ : నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

Join Our COmmunity

నల్గొండ జిల్లాలో గల నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రంలో కొద్ది సేపటి క్రితం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో జలవిద్యుత్ కేంద్రంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మంటలు ఎగసి పడ్డాయి. అయితే ఈ విషయాన్ని ముందే గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.

తమ సిబ్బందితో కలిసి ఈ మంటలను అదుపు చేశారు అధికారులు దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.  ఈ మధ్య కాలంలో శ్రీశైలంలోని ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మంటలు భారీగా వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. భారీగా  ఆస్తి నష్టం కూడా సంభవించింది.

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news