ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు

-

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్ గా ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది సర్కార్. కంపెనీల చట్టం 2013 కింద వంద శాతం ప్రభుత్వ నిధులతో ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేసింది. ఐదు కోట్ల రూపాయల ప్రాథమిక పెట్టుబడితో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్సు డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ని ఏర్పారు చేశారు.

విజయవాడలోని రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్పోరేషన్ కార్యాలయం పనిచేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాబూ జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల కింద ఉత్తరాంధ్ర జిల్లాల్లో తాగునీటి సరఫరా, పరిశ్రమలకు నీరిచ్చిందుకు ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 8 లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాతో పాటు 1037 గ్రామాల్లోని 30 లక్షల జనాభాకు తాగునీరు, పరిశ్రమలకు నీటి సరఫరా చేసేందుకు ఈ కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఈ ఆదేశాల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news