మన దేశంలో ఉపాధి పరిశ్రమల ద్వారా లభిస్తుంది. ఈ పరిశ్రమలకు మూల స్తంభాలు ఎవరంటే స్కిల్డ్ వర్కర్స్. వీరిని తయారుచేసే కేంద్రాలే ఐటీఐలు. ఇవి ఆయా ట్రేడులకు సంబంధించిన శిక్షణను, అప్రెంటిస్‌షిప్‌ను ఇప్పించి ఆయా పరిశ్రమలకు అవసరమైన నిపుణులను అందిస్తాయి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నే షార్ట్ గా ఐటీఐ అంటారు. తాజాగా 12 ప్రైవేట్ ఐటీఐలు ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది.
విజయనగరం, విశాఖ, తూ.గో, కృ ష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఎనిమిది ప్రైవేట్ ఐటీఐలకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లాలో ఐదు ప్రైవేట్ ఐటీఐలకు అనుమతులివ్వగా, తిరుపతిలో రెండేసి ప్రైవేట్ ఐటీఐలకు, మిగిలిన చోట్ల ఒక్కో ఐటీఐ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది సర్కార్. ప్రకాశం జిల్లా చౌటపాలెం, మెదర మెట్ల(2), పొదిలి, కనిగిరి, గ్రామాల్లో ప్రైవేట్ ఐటీఐలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, విజయనగరం జిల్లా మంగపాలెం, విశాఖ జిల్లా కొత్త కొవ్వాడ, తూ.గో జిల్లా గుడిమెల్లంక, కృష్ణా జిల్లా కలవపాముల, గుంటూరు జిల్లా నగరంలో, అలానే తిరుపతిలో రెండు ప్రైవేటు ఐటీఐలకు అనుమతి ఇచ్చింది.