ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవు : మంత్రి నారాయణ

-

ఈ రోజు ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవని.. మున్సిపల్ శాఖలో రూ.3500కోట్లు మాత్రమే ఉన్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో క్రమేణా దర్గాని అభివృద్ధి చేశామని,పండుగ కోసం వచ్చే భక్తులు కోసం అన్ని వసతులు కల్పించామన్నారు. ఈరోజు(బుధవారం) మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారని తెలిపారు. విదేశాల నుంచి కూడా భక్తులు రొట్టెల పండుగకు వస్తారని అన్నారు. దర్గాలోని పనులను కొద్దిగా సమయం తీసుకొని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పారిశుధ్యం, తాగునీరు, పార్కింగ్, వసతులు ఉండాలన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, రొట్టెల పండుగకి వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. రూ.కోటీ 57 లక్షలకు టెండర్లు పాడినట్లు,దర్గా అభివృద్ధికి ఈ నిధులు వినియోగించుకునే ఏర్పాట్లు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news