మన్యం ప్రజలకి ఏపీ సర్కార్ శుభవార్త

-

మన్యం ప్రజలకి ఏపీ సర్కార్ శుభవార్త అందించింది. ఏపీలోని 5 ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం రూ.246.30 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులిచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాల ఐటీడీఏలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మితం కానున్నాయి.

వీటి వలన నిరుపేదలకు కిడ్నీ, గుండెపోటు వంటి జబ్బులొస్తే విశాఖ, విజయవాడ, గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి మారుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక వీటితో రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు, మరో 16 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) తెలిపారు. మొన్నీమధ్య ఆయన శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో, విజయనగరం జిల్లా పార్వతీపురంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి స్థలాలను పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news