పంచాయతీ రాజ్‌ శాఖపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్‌ శాఖలో కొత్త పోస్ట్‌ క్రియేట్‌ చేస్తూ గెజిట్‌ విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. డివిజన్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్ పేరు తో కొత్త పోస్ట్‌ క్రియేట్‌ చేసింది ఏపీ ప్రభుత్వం. ఎంపీడీవోల ప్రమోషన్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌.

jagan
jagan

అలాగే…. డిపార్ట్మెంటల్‌ పరీక్షల ద్వారా ఎంపీడీవో లకు ప్రమోషన్‌ ఇవ్వనుంది ప్రభుత్వం. పంచాయతీ రాజ్‌ శాఖలో కొత్త పోస్ట్‌ క్రియేట్‌ చేయడం ద్వారా… ఎంపీడీవోల కు తగిన గుర్తింపు దక్కుతుందని భావించిన ఏపీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమచారం అందుతోంది. పంచాయతీ రాజ్‌ శాఖ లో సీనియర్‌ మరియు మేధావుల అభిప్రాయం మేరకే జగన్‌ సర్కార్‌ ఈ నిర్ణయానికి వచ్చింది. ఇక తాజాగా జగన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్నయంతో… పాలన కూడా సులభతరం కానుంది.