కరోనా కారణంగా ఈ అకడమిక్ ఇయర్ లో విద్యార్థులు చాలా కాలం పాటూ ఆన్లైన్ లోనే పాఠాలు విన్నారు. ఇక మొబైల్ ఫోన్ లు, టాబ్ లు లేని వారు ఆన్లైన్ క్లాసులు కూడా వినలేకపోయారు. ఇక ఆన్ లైన్ లో బోధన కూడా తూ తూ మంత్రంగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో పదో తరగతి విద్యార్థులు వారి తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యావిధానంలో స్వల్ప మార్పులు చేసింది.
కరోనా కారణంగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోలన తగ్గించేందుకు పరీక్షా పత్రాలను కుదిస్తు నిర్ణయం తీసుకుంది. 2022 విద్యాసంవత్సరం నుండి పదో తరగతిలో ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ విధానంలోనే 2022 సంవత్సరపు పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయని వెల్లడించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ లో కూడా ఏడు పేపర్లు ఉంటాయని పేర్కొంది.