ఏపీలో స్కూళ్లు.. కాలేజీల్లో ఫీజుల పై సర్కార్ కీలక ఉత్తర్వులు

-

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజు వసూళ్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు వసూళ్లపై ప్రభుత్వం నియంత్రణకు సిద్దం అయింది. కరోనా కారణంగా ప్రజల ఆర్ధిక కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఫీజులు తగ్గించుకోవాలని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ట్యూషన్ ఫీజులో 30 శాతం మేర తగ్గించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. కరోనా కారణంగా చాలా కాలం పాటు స్కూళ్లు, కాలేజీలు తెరవలేదు కాబట్టి నిర్వహాణ భారం తగ్గి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

నవంబర్ రెండో తేదీ నుంచి స్కూళ్ల ప్రారంభించనున్న క్రమంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆ మేరకు సిలబస్ కూడా తగ్గించాలని కూడా సూచనలు చేసింది. ఇక నవంబర్‌ 2 నుంచి రాష్ట్రంలో డిగ్రీ, పీజీ తరగతులను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూనివర్సిటీలు, కళాశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో వారంలో 6 రోజుల పాటు తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఒక వేళ వీక్ డేస్ లో సెలవు ఇవ్వాల్సి వస్తే రెండో శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహించాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news