విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది..అరకు, పాడేరు ప్రాంతాల్లో చలిగాలులు విజృంభిస్తున్నాయి..రోజు రోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి..ఈరోజు అరకు లోయలో 18 డిగ్రీల ఉష్ణోగ్రతనమోదైంది..మన్యంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది..
పాడేరుకు సమీపంలోని అరకు లోయ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్ కు పడిపోయింది..
భారీగా కురుస్తున్న పోగమంచుతో వాహనదారులు లైట్లు వేసుకుని నడపాల్సివస్తోంది..మరోవైపు వరుసగా శని, ఆదివారాలు సెలవులు రావడంతో పర్యటకుల తాకాడి పెరిగింది..మన్యంలో పొగమంచు మధ్య ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో, హోటళ్లు, అతిథి గృహాలు కిక్కిరిశాయి..పర్యటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.