కేంద్రానికి చేరిన ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం.. ఏం జ‌రుగుతుందో..?

-

శానససభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని శాసనసభలో ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రే తీర్మానం ప్రతిని, ఓటింగ్ వివరాలకు సంబంధించిన పూర్తి అంశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శాసనసభ సచివాలయం పంపింది. అయితే వైసీపీ ప్రభుత్వం తాజాగా ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి జగన్ సర్కార్ పంపింది.

హోం శాఖ, ఎన్నికల సంఘానికి కూడా మండలి రద్దు తీర్మానం, ఓటింగ్ సరళిని పంపినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లుపై కేబినెట్‌లో తీర్మానం చేసిన తర్వాత బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది.. అనంతరం రాష్ట్రపతి కూడా ఆమోదించి, నోటిఫికేషన్‌ జారీ చేస్తే మండలి రద్దు అవుతుంది. అప్పటివరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రతి బిల్లూ మండలికి వెళ్లాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news