మహిళల రక్షణ కోసం ఏపీ సర్కార్ మరో పధకం

ఏపీలో అభయం అనే పధకం ప్రారంభం కాబోతోంది. సోమవారం ఈ అభయం ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మహిళల రక్షణ కోసం ప్రాజెక్టు అభయ పేరుతో పథకాన్ని ఒక పధకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీన్ని ఏపీలో అభయం పేరుతో ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ సిద్దం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. నిర్భయ ఘటన తర్వాత ప్రాజెక్టు అభయ పథకాన్ని రూపొందించింది కేంద్రం.

 

ఈ అభయం ప్రాజెక్టులో భాగంగా ఆటోల్లో ట్రాకింగ్ పరికరాలను ప్రభుత్వం అమర్చనున్నది. ఏపీలో రూ. 135 కోట్లతో లక్ష ఆటోల్లో ట్రాకింగ్ డివైసులు అమర్చేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ నిధులలో 60 శాతం నిధులను కేంద్రం భరించనున్నది. ఈ మేరకు ఇప్పటికే రూ. 58.64 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలో పైలెట్ ప్రాజెక్టు కింద విశాఖలో అభయం అమలు కానుందని అంటున్నారు. దీని మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.