కరోనా ఎఫెక్ట్: బస్సు సర్వీసులకు బ్రేక్‌..!

-

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్-కర్ణాటకకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఈ నెల 15 నుంచి నిలిచిపోనున్నాయి. ఏపీ వైపు సర్వీసులను ఆపేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కర్ణాటక.. ఏపీ నుంచి వచ్చే బస్సులను అనుమతించే విషయమై కూడా ఇవాళ సాయంత్రంలోపు స్పష్టత ఇవ్వనుంది. అంతేకాదు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. బెంగళూరు నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరులు రాకపోకలు కొనసాగిస్తున్నారు.

అలాగే కర్ణాటక కూడా ఏపీకి బస్సులు నిలిపివేసింది. దీంతో ఏపీ అధికారులు కూడా ఆలోచనలో పడ్డారు. పరిస్థితిని గమనించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ బస్సు సర్వీసులను రద్దు చేస్తే కనుక ఎవరైతే ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్లు బుక్ చేసుకున్నారో వారికి తిరిగి డబ్బు చెల్లించనుంది. బెంగళూరు సిటీ మ‌రియు రూర‌ల్‌ ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వ‌ర‌కు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లోకి వెళ్ల‌నుంది.. అత్య‌వ‌స‌రాలు, నిత్యావ‌స‌రాలు మిన‌హా.. అన్ని లాక్‌డౌన్ పాటించాల్సిందేన‌ని ఇప్ప‌టికే క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news