వాహనదారులకు ఏపీ సర్కార్‌ బిగ్‌ షాక్‌ !

వాహనదారులకు జగన్‌ సర్కార్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు రవాణాశాఖ మంత్రి పేర్నినాని. పర్యావరణాన్ని రక్షించేందుకు , అధిక కర్బనాలను విడుదల చేసే పాత వాహనాలను నిరుత్సాహపరిచేందుకు ఈ చట్ట సవరణ చేసినట్లు ఈ సందర్భంగా పేర్ని నాని వెల్లడిచంఆరు. మోటారు వాహనాల పన్నులు పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని… గ్రీన్ ట్యాక్స్ పేరిట ఈ పన్నులు పెంచాలని నిర్ణయంచామన్నారు.

పదేళ్లలోపు వాహనాలు, 12 ఏళ్లు మించిన వాహనాలు, రవాణా, రవాణేతర వాహనాలు, ఏడు నుంచి 10 ఏళ్లలోపు వాహనాలు 4 వేల రూపాయలు ట్యాక్స్‌ కట్టాలన్నారు. 12 ఏళ్లు దాటితే 6 వేల రూపాయల గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పర్యావరణ హితం కోసం గ్రీన్ ట్యాక్స్ ను అదనంగా విధించాలని నిర్ణయం తీసుకున్నామని… నూతన వాహనాల విక్రయించినప్పుడు కూడా పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

20 లక్షల రూపాయల పైబడిన వాహనాలపై 18 శాతం వరకూ పన్ను విధించామని… అదనంగా 4 శాతం పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐదు లక్షల లోపు ఉన్న వాహనాలకు 1 శాతం మాత్రమే పన్ను పెంచుతున్నామని.. 10 లక్షలపైబడిన వాహనాలకు 3 శాతం పన్ను అదనంగా విధించాలని చట్టంలో మార్పులు చేస్తున్నట్లు వివరించారు.