కైకాల చికిత్సకు అండగా ఏపీ సర్కార్…!

ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం భారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికే కొందమంది అత్యుత్సాహ వంతులు కైకాల చనిపోయారని ప్రచారం కూడా చేశారు. కానీ కైకాల కూతురు తండ్రి కోలుకుంటున్నారు అని స్పష్టం చేస్తూ ఓ ఆడియో మెసేజ్ ను విడుదల చేసారు. ఇదిలా ఉంటే కైకాల ఆరోగ్యాన్ని మెగాస్టార్ చిరంజీవి మానిటర్ చేస్తున్నారు.

కైకాల కుమారుడు రామారావు కు సీఎం జగన్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. అంతే కాకుండా కైకాల చికిత్స కోసం ప్రభుత్వం తరపున సాయం చేస్తామని సీఎం జగన్ చెప్పినట్టు పేర్ని నాని ప్రకటించారు. అంతే కాకుండా ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు కావడం తో కైకాల సత్యనారాయణ ఆరోగ్యం పై బాలకృష్ణ, మోహన్ బాబు, శివరాజ్ కుమార్, కన్నడ స్టార్ యాష్ లు అరా తీశారు. ఇక అప్పట్లో కత్తి మహేష్ కు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలోనూ ఏపీ సర్కార్ చికిత్స కోసం సాయం అందించింది.