రంగుల విషయంలో సుప్రీం కోర్ట్ లో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలిన కాసేపటికే ఏపీ హైకోర్ట్ కూడా షాక్ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై స్టే ఇచ్చింది హైకోర్ట్. రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించటం సరికాదని హైకోర్టుకు రాజధాని ప్రాంత రైతులు వెళ్లి పిటీషన్ దాఖలు చేసారు.
దీనిపై దాదాపు 20 రోజుల నుంచి హైకోర్ట్ లో వాదనలు నడుస్తున్నాయి. ఇప్పటికే రెవెన్యు శాఖ అధికారులు ఈ విషయంలో వెనక్కు తగ్గకపోతే తాము జోక్యం చేసుకుంటాము అని కూడా కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధానిలో భూములను అక్కడి పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్ట్ కి తన వాదనలను వినిపించారు. అది చట్ట విరుద్దమని ఆయన ఆరోపించారు.
ఇక్కడ స్థలాలను దుగ్గిరాల, విజయవాడ, మంగళగిరి వారికి కేటాయించటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదన వినిపించారు. ప్రధాని మంత్రి ఆవస్ యోజన లో కూడా ఇళ్ల నిర్మాణం జరిగిందని, దుగ్గిరాల, మంగళగిరి సీఆర్డఏ పరిధిలోనే వస్తాయని కోర్టు కి ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు. ఇటీవల దీనిపై తీర్పుని రిజర్వ్ చేసిన కోర్ట్… నేడు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్ట్.