ఏపీలో ఉన్న పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవు: ఏపీ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

-

మీడియా, సోషల్ మీడియాలో వ్యాఖ్యలపై ఏపీ హైకోర్ట్ లో విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఐడీ విఫలమైతే సీబీఐకి విచారణ బదలీ చేయాల్సి ఉంటుందని ఏపీ హైకోర్ట్ హెచ్చరించింది. స్పీకర్ చేసిన వ్యాఖ్యలు శాసనసభలో చేశారా? బయట చేశారో చెప్పాలని హైకోర్టు అడగగా హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది స్పందిస్తూ… తిరుపతి కొండపై మీడియా ముందు స్పీకర్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. మరిన్ని వ్యాఖ్యలు చేసింది. ఇదంతా చూస్తుంటే న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు భావించాల్సి ఉంటుందని హెచ్చరికలు చేసింది.

ap hight court
ap hight court

సీబీఐ విచారణపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ అన్నారు. అయితే తీర్పు మాత్రం హైకోర్ట్ రిజర్వ్ చేసింది. స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు నందిగం సురేష్, విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలపై హైకోర్టులో విచారణ జరగగా… ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వీరి వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. వైసీపీ నేతల వ్యాఖ్యలు కోర్టులపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.

వ్యాఖ్యలు చేసిన నేతలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని నిలదీసింది. ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా మాట్లాడతారు అని నిలదీసింది. ప్రభుత్వం, కోర్ట్ లు కలిసి పని చేసుకుంటే మంచిది అని పేర్కొంది. ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నారని కోర్ట్ పేర్కొంది. న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు లేవు అని నిలదీసింది. రిజిస్ట్రార్ కేసు దాఖలు చేసినా పదవిలో ఉన్నవాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించింది. నేతలను రక్షించేందుకే మీరు కేసు నమోదు చేయలేదని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.

బాద్యతాయుతమైన రాజ్యాంగబద్ద పదవిలో ఉండి న్యాయవ్యవస్థ లపై అనుచిత హ్యఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని ఆయనను హైకోర్ట్ హెచ్చరించింది. అదే విధంగా హైకోర్టు తీర్పులపై అసహననం ఉంటే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవాలని, అలా కాకుండా బహిరంగంగా కోర్టు తీర్పులపై హ్యఖ్యలు చేయడం సరియైన విధానం కాదని సూచించింది. ఏపీ లో నెలకొన్న పరిస్థితులు దేశంలో ఎక్కడా నెలకొనలేదని పేర్కొంది

Read more RELATED
Recommended to you

Latest news