ఏపీలో కరోనా చికిత్సలపై హైకోర్టు అసంతృప్తి.. ప్రభుత్వంపై ఆగ్రహం

-

అమరావతి: కోవిడ్ వైద్యచికిత్సలపై హైకోర్టులో విచారణ జరిగింది. కొవిడ్ వైద్యచికిత్సలు సక్రమంగా అందడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, ఏపీసీఎల్ఏ వేసిన పిల్ వేశారు. ఈ పిల్‌ను స్వీకరించిన ధర్మాసనం ఆస్పత్రుల్లో పడకల లభ్యత, ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజుల వసూలు అంశాలపైనా విచారణ చేపట్టింది. కోవిడ్ నియంత్రణ, చికిత్సలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వ న్యాయవాది అమికస్ క్యూరీ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. అయితే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత లేదని గత అఫిడవిట్లో పేర్కొన్నారని, ఇప్పుడు ఆక్సిజన్, బెడ్లు ఖాళీ లేవని నోడల్ ఆఫీసర్లే చెబుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం అఫిడవిట్లో ఇచ్చిన లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని మండిపడింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news