రేషన్ వాహనాల విషయంలో ఎన్నికల ఎస్ఈసి ఆదేశాలపై హైకోర్ట్ స్టే విధించింది. గతంలో రేషన్ వాహనాలు రంగులు మార్చాలని ఎస్ఈసి ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసి ఆదేశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అలానే మార్చి 15 వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు పేర్కొంది.
అయితే మరో పక్క ఈ ఆదేశాలతో ఇంటింటికి రేషన్ పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధం అవుతున్నట్టు చెబుతున్నారు. ఎస్ఈసి ఆదేశాలను హై కోర్టు సస్పెండ్ చేయడంతో మొబైల్ వాహనాల ద్వారా పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారభించి జిల్లా స్థాయిలో ఏర్పాట్లపై సమీక్ష కూడా జరిపినట్టు చెబుతున్నారు.