ఏపీలో అసలు రాజ్యాంగ పాలన జరుగుతుందా..? : హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు

-

ఏపీ లో ప్రభుత్వానికి హైకోర్టుకు మధ్య రాను రాను గ్యాప్ పెరుగుతూనే ఉంది. తాజాగా మరో సారి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఏపీ హైకోర్ట్ లో విచారణ సందర్భంగా ప్రభుత్వంపై ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రెడ్డి గౌతమ్, ఎల్లంటి లోచినికి సమబందించి హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సంధర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలను మేం గమనిస్తున్నామని అసలు రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా..? లేదా అనే అంశంపై విచారించి న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా..? అని ప్రశ్నించింది.

న్యాయపరమైన అవకాశాలను పరిశీలించి తమకు తెలియచేయాలని పిటిషనర్ తరపున న్యాయవాది రవితేజను ఆదేశించింది ధర్మాసనం. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది శాసనమండలిలో వ్యతిరేకిస్తే శాసనమండలి రద్దుకు సిఫారుసు చేసిన విధానం మా దృష్టిలో ఉందన్న కోర్టు, రాష్ట్రంలో దాఖలవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్లను కూడా మేము పరిశీలిస్తున్నామని పేర్కొంది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వచ్చిన పోస్టింగ్స్ పై రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా దీన్ని సీరియస్ గా తీసుకోకపోవడం కూడా గమనించామని, అందువల్లే రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news