ఏమాత్రం అవకాశం దొరికినా చంద్రబాబుపై నిప్పులు చెరిగే వైకాపా నేతల్లో టాప్ 5లో ఒకరు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పుకోవచ్చు! ఆ స్థానం కాపాడుకోవడంతో పాటు మరింత పైకి ఎగబడాలనే తపనతో అన్నట్లుగా తాజాగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, టీడీపీ నేతలపైనా అనీల్ తనదైనమార్కు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివరళ్లోకి వెళ్తే…టీడీపీ లీడర్లు 12 గంటల దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇలాటి దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, దానివల్ల పార్టీకి మరింత బ్యాడ్ అని “మనలోకం.కాం” హెచ్చరించిన సంగతి తెలిసిందే! ఇదే క్రమంలో ఈ దీక్షలపై తనదైన శైలిలో ఫైరయ్యారు మంట్రి అనీల్ కుమార్! ఇవి కేవలం తిన్నది అరక్క చేస్తున్న దీక్షలు మాత్రమే అని ఆయన మండిపడుతున్నారు. ఇదే క్రమంలో దేశంలో కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపిన మంత్రి… మొత్తం టెస్టుల్లో దేశవ్యాప్తంగా 4.5 కేసులు నమోదవుతుంటే.. ఏపీలో అతి తక్కువగా 1.5 శాతం కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మంత్రి వెల్లడించారు.
చంద్రబాబు ప్రజలకు మంచి చేయకపోయినా పర్లేదు కానీ భయబ్రాంతులకు గురిచేయొద్దని సూచించిన అనీల్… సీఎం జగన్ ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంటే.. చంద్రబాబు భయాలను పెంచుతున్నారని మండిపడ్డారు. కర్నూలు ఎంపీ ఇంట్లో నలుగురు డాక్టర్లకు పాజిటివ్ వస్తే చంద్రబాబు హేళన చేస్తున్నారని… వారు డాక్టర్లని, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారని మంత్రి అనీల్ వ్యాఖ్యానించారు. ఇక రైతుల విషయంపై లేఖలో పేర్కొన్న చంద్రబాబు… ఏనాడైనా రైతులను ఆదుకున్నారా? అని సూటిగా ప్రశ్నించారు అనీల్! గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ రైతులను ఆదుకోని చంద్రబాబు… ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తూ, రైతులపై దొంగప్రేమ చూపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ… రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కావాలి, దాక్కోడానికి హైదరాబాద్ కావాలా అని విమర్శించారు ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్!