బ్రేకింగ్; ఏపీ మంత్రికి కరోనా పరిక్షలు, ఫలితం ఇదే…!

-

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కి అధికారులు కరోనా నిర్ధారణ పరిక్షలు చేసారు. ఆయనకు కరోనా నెగటివ్ అని వచ్చింది. ఇటీవల ఆయన కరోనా వచ్చిన వైద్యుడ్ని కలిసారు. ఆ వైద్యుడు ఆస్పత్రి ప్రారంభానికి పిలవగా మంత్రి వెళ్ళారు. ఆ తర్వాత వైద్యుడికి కరోనా వైరస్ వచ్చింది. దీనిపై అధికార పార్టీలో కలకలం రేగింది.

వెంటనే మంత్రి హోం క్వారంటైన్ కి వెళ్ళారు. ఆయన క్వారంటైన్ లో ఉండే వైద్య పరిక్షలు చేయించుకోగా ఆయనకు నెగటివ్ అని వచ్చింది. దీనితో మంత్రి ప్రజల్లోకి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇక అధికార పార్టీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఇక ఇది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గి చెలరేగిపోతుంది కరోనా వైరస్.

రాష్ట్రంలో కరోనా కేసులు 303 కి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు అప్రమత్తంగానే వ్యవహరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news