వైసీపీ మంత్రి గన్ మెన్ వీరంగం.. అందరూ చూస్తుండగానే కూతురు పై…!

-

ap minister gunman slamming his daughter and son in law
ap minister gunman slamming his daughter and son in law

ప్రేమించి పెళ్లి చేసుకుంది అనే కోపంతో ఓ మంత్రి గన్ మెన్ తన కూతురి పై అల్లుడి పై దాడి చేసేందు యత్నం చేసి వీరంగం సృష్టించాడు. ఈ ఘటన ఏపీ లోని ఏలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరులో నివాసం ఉంటున్న చంద్రారావు ఏపీ మహిళ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన కూతురు గతంలో ప్రేమించిన యువకుడితో వివాహం చేసుకుంది.

తన కూతురు సాయి గాయత్రి ప్రేమ వివాహం చేసుకోవటం చంద్రారావు కు ఇష్టం లేదు, గతంలో చంద్రారావు కూతురిని బెదిరించినప్పటికి పెద్దలను ఎదురించి కిరీటీ అనే యువకుడితో ప్రేమ వివాహం చేసుకుంది. ఇక అప్పటినుండి కక్షతో రగులుతున్న చంద్రారావు శనివారం సాయిగాయత్రి, ఆమె భర్త కిరిటీ, కిరిటీ తండ్రి జోసెఫ్‌ ను వెంటబెట్టుకొని ఏదో  పనిమీద సోషల్ వెల్ఫేర్ ఆఫీసుకు వచ్చిన విషయం తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న చంద్రరావు కొందరిని వెంట బెట్టుకొని వారి వద్దకు వెళ్లాడు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే తన కుమార్తెను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీనిని అడ్డుకున్న కిరిటీ, అతడి తండ్రిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకోవడంతో పరారయ్యాడు. ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు చంద్రరావు సహ మరికొందరిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news