కరోనాపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!

-

కరోనా వైరస్ ని ఇప్పుడు కట్టడి చేయకపోతే వచ్చే రెండు నెలల్లో మన చేతుల్లో ఏమీ ఉండదని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రి పెర్ని నానీ అన్నారు. మీడియాతో శనివారం సాయంత్రం మాట్లాడిన నానీ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మనలో మార్పు రాకుంటే ఏప్రిల్, మే మాసాల్లో ఈ పరిస్థితులు ఉండవని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు.

ఒక్కసారి కరోనా పాజిటీవ్ కేసులు రెట్టింపైతే మనమంతా అచేతలం కాక తప్పదని, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోగలుగుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కొంత మంది మనకేం కాదనే భావనలో కట్టడి లేకుండా రోడ్ల మీదకు వచ్చి కరోనా వ్యాప్తికి సహకరిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇప్పుడు కనుక మనమంతా కలిసి కరోనాను కట్టడి చేయకుంటే అమెరికా, ఇటలీల దుస్థితే మనకు వస్తుందని హెచ్చరించారు.

ప్రపంచ మొనగాడిని నేనే అన్న అమెరికా నేడు ఇటలీని మించిపోయిందని… అమెరికా అక్కడి ప్రజలను విచ్చలవిడిగా రోడ్ల మీదకు వదిలేయటంతో నేడు ఈ దుస్థితి వచ్చిందని, ఆ పరిస్థితులు మనకు రాకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయని ఆయన అన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని… యువత తమతమ బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news