ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఎన్నికల కౌంటింగ్ మొదలయింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయింది. 11 కార్పొరేషన్లు ,71 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట లో మాత్రం కౌంటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. హైకోర్టు తుది తీర్పు తర్వాత అధికారులు అక్కడ కౌంటింగ్ చేపట్టనున్నారు. ఇక ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడమే కాక,144 సెక్షన్ కూడా విధించారు.
కౌంటింగ్ కోసం కార్పొరేషన్లలో 2204 టేబుల్స్….మున్సిపాలిటీలలో 1822 టేబుల్స్ అన్నీ మొత్తంగా 4026 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కార్పోరేషన్ లలో కౌంటింగ్ సూపర్ వైజర్స్ 2376 మంది, కౌంటింగ్ స్టాఫ్ -7412 మంది…మున్సిపాలిటీలలో కౌంటింగ్ సూపర్ వైజర్స్ 1941 మంది మొత్తం కౌంటింగ్ స్టాఫ్ సంఖ్య 5195గా ఉండనుంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 పోలీసు సిబ్బందిని నియమించగా వారిలో 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు, 1345 మంది ఎస్సైలు, 17292 మంది కానిస్టేబుళ్లు 1134 మంది హోంగార్డులని ఏర్పాటు చేశారు.