అమరావతి : ఏపీ పాలిసెట్ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏపీ పాలిసెట్ 2021 ఫలితాలను విడుదల చేశారు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. సెప్టెంబర్ 1 న పరీక్ష నిర్వహించగా.. 74 వేల మంది దరఖాస్తు చేసు కోగా 64 వేల మంది అర్హత సాధించారు. అలాగే 94.21% అర్హత సాధించారు.
ఇక ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పాలిసెట్ ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం శ్రీకాకుళం జిల్లా దక్కించుకుందని.. అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం నెల్లూరు జిల్లాకు దక్కిందన్నారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం ప్రకాశం జిల్లా దక్కిందన్నారు మంత్రి మేకపాటి. మంచి ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు మంత్రి మేకపాటి. జగనన్న విద్యా దీవెన ద్వారా 81 వేల మంది విద్యార్థులకి రూ.128 కోట్లు అందజేశామని.. 72 వేల మంది విద్యార్థుల కి రూ.54 కోట్లు జగనన్న వసతిదీవెనగా అందించామని స్పష్టం చేశారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.