తెలుగు చిత్రసీమను డ్రగ్స్ సమస్య కుదిపేస్తుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణంతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రచ్చ ఇప్పుడూ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. తొలుత కన్నడ చిత్ర సీమను కుదిపేయగా.. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీని పట్టుకుంది. ఈ కేసుపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో తొలుత పూరిజగన్నాథ్, ఛార్మి , రకుల్ , రవితేజ, రానా, నందు, నవదీప్‌లను విచారించింది. వారికి డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఏమైనా సంబంధాలున్నాయని ఆరా తీస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో బ్యాక్ లావాదేవీలపై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలోనే హైటం బాంబు, సినీ నటి ముమైత్ ఖాన్ బుధవారం ఈడీ ఎదుట హజరయ్యింది. నేడు దాదాపు 8 నుండి 10 గంటల పాటు విచారించనున్నట్టు తెలుస్తుంది. ముమైత్ ఖాన్ తన ఆడిటర్ తో పాటు బ్యాంకు ఖాతాలను తీసుకొచ్చింది. గతంలోనూ ముమైత్ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఆరోపణ లెదుర్కుంటున్న సినీ తారల బ్యాంకు ఖాతాలను తీసుకురావాలని ఈడీ అధికారులు కోరారు. ఇక ఈ కేసులో 17న తనీశ్, 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు.