ఏపీ రేషన్ మార్గదర్శకాలు; జగన్ కీలక ఆదేశాలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో మూడో సారి రేషన్ సరుకుల పంపిణి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సామాజిక దూరం పాటిస్తు సరుకులను పంపిణి చేస్తారు. ఈ మేరకు సామాజిక దూరం సహా పలు అంశాలపై రెవెన్యూ అధికారులు, డీలర్లకు మార్గదర్శకాలు జారి చేసింది రాష్ట్ర సర్కార్.

బియ్యం కార్డు దారులకు ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు రేషన్ దుకాణాల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ చేస్తారు. కరోనా నిబంధనలను పాటించడమే కాకుండా సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకోవాలని సూచించింది. టైం స్లాట్ టోకెన్‌లు ఇస్తారని… ఒక్కో రేషన్ షాపులో రోజుకు 30 మందికి సరుకులు పంపిణీ చేస్తారన్నారు. మొదటి, రెండు విడతల్లో VRO లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించగా…

మూడో విడతలో మాత్రం లబ్దిదారుల సొంత బయోమెట్రిక్ తప్పనిసరి అవుతోందని ప్రభుత్వం పేర్కొంది. కరోనా జాగ్రత్తల్లో భాగంగా అన్ని రేషన్ షాపుల దగ్గర శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచారు. ప్రతి లబ్దిదారుడు, బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్‌ని చేతిలో వేసుకోవాలి. అది ఆరిపోక ముందే గబగబా రెండు చేతులకూ రాసేసుకోవాలి. అలా రాసుకునేలా రేషన్ డీలర్ జాగ్రత్తలు తీసుకోవాలి. డీలర్ తప్పనిసరిగా శానిటైజర్ ఉంచాలి. లేకపోతే మాత్రం మాత్రం లబ్దిదారులు ఆ డీలర్‌ మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news