పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో చాలా సినిమాలు ట్రెండ్ క్రియోట్ చేసినవే. వాటిలో కొన్ని ట్రెండ్ సెట్ చేశాయి. అలాంటి సినిమాలో ఖుషి గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ టాప్ టెన్ సినిమాల లిస్ట్ లో ఖచింతంగా ఉంటుంది. తొలిప్రేమ సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. అప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని స్టృష్ఠిస్తూ పవర్ స్టార్ అన్న ఇమేజ్ ని సాధించాడు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి మెగాస్టార్ తమ్ముడిగా పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన సొంత పాపులారిటీతో పవర్ స్టార్ అన్న ఇమేజ్ ని సాధించుకున్నాడు.
గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు ఒక్కో సినిమా హిట్ అవుతూ హీరోగా నిలబెట్టగా ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎంతో గొప్ప ఇమేజ్ ని ఇచ్చింది. ఏ.కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమాతో టాలీవుడ్ లో అపటి వరకు ఉన్న రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా ఎవరూ ఉహించనంతగా పెరిగిపోయింది. సాధారణంగా టాలీవుడ్ లో ఎంటరయిన ఏ హీరో కైనా రెండవ సినిమానో మూడవ సినిమానో భారీ ఫ్లాప్ గా మిగులుతుంది. ఇది చాలా మంది హీరోల విషయంలో జరిగింది. కాని పవన్ కళ్యాణ్ వరసగా హిట్స్ మీద హిట్స్ కొడుతూనే వచ్చారు.
ఆ తర్వాత వచ్చిన తమ్ముడు మరో బ్లాక్ బస్టర్ కాగా డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాధ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన బద్రి సినిమా ఒక సెన్షేషన్ ని క్రియోట్ చేసింది. పవన్ కళ్యాణ్ పూరి కి అవకాశం ఇచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కాని రెండవ రోజుకి మొత్తం మారిపోయింది. మరోసారి రికార్డ్స్ క్రియోట్ చేసింది. పవన్ మరోసారి ఇండస్ట్రీకి ఒక స్టార్ డైరెక్టర్ ని పరిచయం చేశారన్న టాక్ ఇండస్ట్రీలో బాగా సాగింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమానే ఖుషి. తమిళ దర్శకుడు ఎస్.జె సూర్య అప్పటికే అజిత్ తో వాలి అనే సినిమాని తీసి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. దాంతో తను చెప్పిన ఖుషి కథ పవన్ కళ్యాణ్ కి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం సూర్య మూవీస్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా పెద్ద ట్రెండ్ సెట్టర్ అయింది.
ముందు ఈ సినిమాకి అనుకున్న కాస్ట్ అండ్ క్రూ, సినిమా టైటిల్..ఇతర చాలా విషయాలు వేరే. “చెప్పాలనుంది” అన్న టైటిల్ తో మొదలు పెట్టిన ఈ సినిమా లో ముందు పవన్ కళ్యాణ్ సరసన అమీషా పటేల్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడిగా కొన్ని ట్యూన్స్ కూడా ఓకే చేశారు. అమీషా పటేల్ పవన్ కళ్యాణ్ మీద కొన్ని సీన్స్ కూడా షూట్ చేశాక క్రియోటివ్ డిఫ్రెన్సెస్ చాలా రావడంతో నిర్మాత మొత్తం టీం ని మార్చేశారట. ఆ తర్వాతే ఖుషి సినిమాలో కి హీరోయిన్ గా భూమిక, సంగీత దర్శకుడిగా మెలోడి బ్రహ్మ, ఏ.ఆర్.రెహమాన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మణిశర్మ ఎంటరయ్యారు. ఇక ఈ సినిమాకి మణిశర్మ ఇచ్చిన సాంగ్స్, బ్యాగ్రౌడ్ స్కోర్ అద్భుతం. ఇప్పటికీ ఈ సినిమా ఆర్.ఆర్ ట్రాక్స్ వినిపిస్తుంటాయి. సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాన్ భూమిక మధ్య వచే ఇంటెర్వెల్ సీన్… ముఖ్యంగా భూమిక నడుము చూపించే సీన్ ఒక్కటే మూడురోజులు షూట్ చేశారు. అంతేకాదు ఈ సీన్ తమిళలో కంటే తెలుగులో విపరీతంగా పాపులర్ అయింది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీ రాం అందించిన ఫొటోగ్రఫి సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఫైట్ కోసం పవన్ కళ్యాణ్ దాదాపు 20 రోజులు ప్రాక్టీస్ చేయగా ఆ ఫైట్ ని కంపోజ్ చేయడానికి వారం రోజులు పట్టింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలవరీ, మ్యానరిజం ఇప్పటికి ట్రెండీగానే నిలిచిపోయాయి.
అంతేకాదు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో వచ్చే మొదటి పాట “ఎ మేరా జహా” సాంగ్ కి ఎడిటర్ అన్న విషయం చాలా తక్కువమందికే తెలుసు. ఇక ఈ సినిమాలో అనుకున్న క్లైమాక్స్ కోసం పెద్ద చర్చే జరిగింది. ఎండ్ టైటిల్స్ లో వచ్చే పవన్ కళ్యాణ్… భూమిక.. పిల్లల తో వచ్చే సీన్ సరైన ఎండింగా కాదా ..పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఇది ఎంతవరకు కరెక్ట్… అన్న చార్చలు చాలా జరిగాయి. అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన ఒకే ఒక్క మాట తో దర్శక నిర్మాతలు అదే సీన్ ని ఉంచారు. అది ఎంతో హైలెట్ గా నిలిచింది. ఇన్ని విశేషాలున్న పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాకి నేటితో 19 సంవత్సరాలు కంప్లీట్ అవడం విశేషం.