BRS working president KTR: నేడు ఇందిరా పార్క్‌లో జరిగే ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధించిన సోషల్ మీడియా టీం ప్రకటించింది. ఈ నెల 5న ఆటో డ్రైవర్ల మహాధర్నా నిర్వహిస్తామని గత నెల రోజుల కిందటే ఆటో డ్రైవర్లు ప్రకటించారు.

కానీ.. రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి కదలికలు రాలేదు. ఫ్రీ బస్సు కారణం గా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ… నేడు ఇందిరా పార్క్‌లో జరిగే ఆటో డ్రైవర్ల మహాధర్నా ఉండనుంది. ఈ తరునంలోనే… ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆటో డ్రైవర్ల విజ్ఙప్తి మేరకు కేటీఆర్… అక్కడికి వెళ్లనున్నారు.