రాజధాని కేసులపై నేటి నుండి హైకోర్టులో వర్చువల్ గా రోజువారీ విచారణ ప్రారంభం అయింది. రాజధాని అంశంపై దాఖలైన పిటీషన్ లను ఆన్ లైన్ ద్వారా విచారణను ఏపీ హైకోర్టు చేపట్టింది. సుమారు 226 పిటిషన్లుకు పైన పెండింగులో ఉన్నాయన్న సీజే, అయితే 44 పిటిషన్లను మొదట వింటానన్న ధర్మాసనం. 185 పిటిషన్లు తర్వాత వింటామని ధర్మాసనం పేర్కొంది. ఇక హైకోర్టులో రాజధాని అంశాలపై విచారణ ముగిసింది. విచారణని ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.
రేపటి నుండి మధ్యంతర పిటిషన్స్ ని కూడా విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. మూడు రాజధానులకు సంధించి హైకోర్టు లో దాఖలైన 223 మధ్యంతర పిటిషన్లు దాఖలు కాగా అందులో 189 స్టే కోసం వేసిన పిటీషన్ లు కావడంతో మిగిలిన 34 పిటీషన్ లను ముందుగా విచారించాలని నిర్ణయించింది ధర్మాసనం. అంతే కాక రేపటి నుండి ప్రత్యేక హోధాకు సంబంధించి దాఖలు అయిన కేసులను కూడా ఫుల్ బెంచ్ కు తీసుకున్న ధర్మాసనం. రేపటి నుండి వాటిని కూడా విచారించనున్నది.