గుడ్ న్యూస్ : సుపరిపాలనలో మూడో స్థానానికి ఎగబాకిన ఏపీ

-

ఉత్తమ పరిపాలన అందిస్తున్న రాష్ట్రాల్లో కేరళకు మొదటి స్థానం దక్కింది. ప్రజా వ్యవహారాలు సూచీ 20 20 పేరిట విడుదలైన ర్యాంకుల్లో కేరళ మొదటి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత రెండు మూడు నాలుగు స్థానాల్లో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలు నిలిచాయి. అయితే ఈ సూచీలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చిట్టచివరి స్థానంలో నిలిచింది. పెట్టుబడులు, అభివృద్ధి, సుస్థిరత ఆధారంగా రాష్ట్రాలకు ఈ ర్యాంకులు కేటాయించారు.

మాజీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కె కస్తూరిరంగన్ నేతృత్వంలోని బెంగళూరుకు చెందిన మేధోమథన సంస్థ ‘ప్రజా వ్యవహారాల కేంద్రం(పీఏసీ) ఏటా ‘ప్రజా వ్యవహారాల సూచీ (పీఏఐ) పేరిట నివేదికను రూపొందిస్తోంది. ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం కేరళ (1.388 పిఎఐ ఇండెక్స్ పాయింట్), తమిళనాడు (0.912), ఆంధ్రప్రదేశ్ (0.531), కర్ణాటక (0.468) పాలన పరంగా పెద్ద రాష్ట్రాల విభాగంలో మొదటి నాలుగు ర్యాంకుల్లో నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news