గత ఏడాది నవంబర్ లో చైనాలో పుట్టిన కరోనా వైరస్ నెలలు తిరిగే సరికి పూర్తిగా అన్ని దేశాలకి చేరింది. ఈ దెబ్బకు అగ్రదేశాలు సైతం వణికిపోతున్నాయి. ఇప్పటికీ ఈ కరోనా వైరస్ టెన్షన్ తీరలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ప్రస్తుతం గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో కేసుల గ్రాఫ్ తగ్గుతున్నాయి.
అయితే మున్ముందు రోజుకు 81వేలు చొప్పున కొత్తగా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని కాన్పూర్ ఐఐటీకి చెందిన బృందం హెచ్చరించింది. కాన్పూర్ ఐఐటీకి చెందిన ఈ బృందం యూరప్‌లోని ఎనిమిది దేశాల్లో నమోదైన కేసుల డేటాతో సరిపోల్చి మ్యాథమెటికల్ పద్ధతిలో గణాంకాలను విశ్లేషించింది. 2021 జనవరి 1నాటికి మొత్తం కేసుల సంఖ్య దాదాపు 14.57 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.