ఏపీని వర్షాలు వదిలేలా లేవు. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం పశ్చిమ బెంగాల్ – బంగ్లాదేశ్ తీర ప్రాంతం మరియు దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళా ఖాతము మీద ఉన్నది. ఇది సగటు సముద్ర మట్టానికి 1 . 5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించింది ఉన్నది. వీటి ఫలితంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా… ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు ప్రాంతాల్లో ఈ రోజు మరియు రేపు, తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్లకురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతాతవరణ శాఖ తెలిపింది.