యాపిల్ మ్యూజిక్‌, టీవీ ప్ల‌స్‌, ఆర్కేడ్‌, ఐక్లౌడ్ అన్నీ ఒకే స‌బ్‌స్క్రిప్ష‌న్ కింద‌.. నెల‌కు రూ.195 మాత్ర‌మే..!

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తాజాగా నిర్వ‌హించిన త‌న వ‌ర్చువ‌ల్ ఈవెంట్‌లో యాపిల్ వ‌న్ స‌బ్‌స్క్రిప్ష‌న్ స‌ర్వీస్ ను లాంచ్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. దీని కింద యాపిల్ మ్యూజిక్‌, టీవీ ప్ల‌స్‌, ఆర్కేడ్‌, ఐక్లౌడ్ సేవ‌ల‌న్నీ ల‌భిస్తాయి. కేవ‌లం యాపిల్ వ‌న్ స‌బ్‌స్క్రిప్ష‌న్ కు నెల నెలా రుసుము చెల్లిస్తే చాలు.. ఆయా సేవ‌ల‌న్నింటినీ పొంద‌వ‌చ్చు. వాటికి విడివిడిగా నెల నెలా రుసుము చెల్లించాల్సిన ప‌నిలేదు.

apple announced apple one subscription plan

యాపిల్ వ‌న్ స‌బ్‌స్క్రిప్ష‌న్ కింద మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి వ్య‌క్తిగ‌త ప్లాన్ కాగా, మిగిలిన రెండు ఫ్యామిలీ ప్లాన్స్‌. వ్య‌క్తిగ‌త ప్లాన్ నెల‌కు రూ.195కి ల‌భిస్తుంది. అందులో యాపిల్ మ్యూజిక్‌, టీవీ ప్ల‌స్‌, ఆర్కేడ్‌తోపాటు 50 జీబీ ఉచిత ఐక్లౌడ్ స్టోరేజ్ ల‌భిస్తుంది. అదే మిగిలిన రెండు ఫ్యామిలీ ప్లాన్లు అయితే నెల‌కు రూ.365 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. వీటిలోనూ యాపిల్ మ్యూజిక్‌, టీవీ ప్ల‌స్‌, ఆర్కేడ్ సేవ‌లు ల‌భిస్తాయి. కానీ ఐక్లౌడ్ స్టోరేజ్ 200 జీబీ, 2టీబీ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఫ్యామిలీ ప్లాన్ నెల‌కు రూ.365 కాగా, ప్రీమియ‌ర్ ప్లాన్ లో యూజ‌ర్ల‌కు 2 టీబీ ఉచిత ఐక్లౌడ్ స్టోరేజ్ ల‌భిస్తుంది.

ఈ ప్లాన్ల‌ను యాపిల్ అతి త్వ‌ర‌లోనే అందుబాటులోకి తేనుంది. 100కు పైగా దేశాల్లో యాపిల్ వినియోగ‌దారుల‌కు ఈ ప్లాన్లు ల‌భిస్తాయి. ఇక ప్రీమియ‌ర్ ప్లాన్ ముందుగా ఆస్ట్రేలియా, కెన‌డా, యూకే, యూఎస్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తుంది. త‌రువాత ఇత‌ర దేశాల్లోని యూజ‌ర్ల‌కు ఈ ప్లాన్‌ను అందిస్తారు. ఈ ప్లాన్ల‌ను యాపిల్ క‌స్ట‌మ‌ర్లు నెల రోజుల పాటు ఉచితంగా ట్ర‌య‌ల్ చూడ‌వ‌చ్చు. త‌రువాత న‌చ్చితేనే ప్లాన్‌లో కంటిన్యూ అవ్వ‌చ్చు.