వాచ్ సిరీస్ 6, కొత్త ఐప్యాడ్ల‌ను లాంచ్ చేసిన యాపిల్‌..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తాజాగా నిర్వ‌హించిన ఓ వ‌ర్చువ‌ల్ ఈవెంట్‌లో త‌న కొత్త ప్రొడ‌క్ట్స్‌ను లాంచ్ చేసింది. వాచ్ సిరీస్ 6 యాపిల్ వాచ్‌ల‌తోపాటు కొత్త ఐప్యాడ్లు, వాచ్ ఎస్ఈ పేరిట బ‌డ్జెట్ ధ‌ర‌కే ఓ నూత‌న యాపిల్ వాచ్‌ను ఆ సంస్థ విడుద‌ల చేసింది.

apple launched watch series 6, watch se, ipad 8th gen, ipad air 4th gen devices

వాచ్ సిరీస్ 6 యాపిల్ వాచ్‌ల‌లో కొత్త‌గా బ్ల‌డ్ ఆక్సిజ‌న్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల ర‌క్తంలో ఆక్సిజ‌న్ స్థాయిలు ఎంత ఉన్నాయో తెలుస్తుంది. ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్‌ప్లేను గ‌త వాచ్‌ల క‌న్నా మెరుగ్గా తీర్చిదిద్దారు. ఈ వాచ్‌ల‌కు ప‌లు నూత‌న వాచ్ ఫేస్‌ల‌ను అమర్చుకోవ‌చ్చు. యాపిల్ ఎ13 బ‌యానిక్ ప్రాసెస‌ర్‌ను ఈ వాచ్‌ల‌లో అమ‌ర్చారు. ఇవి దాదాపుగా 18 గంట‌ల వ‌రకు బ్యాట‌రీ బ్యాక‌ప్ ఇస్తాయి. వాచ్ ఓఎస్ 7 వీటిలో ల‌భిస్తుంది. అలాగే ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను కూడా వీటిలో అందిస్తున్నారు. యాపిల్ వాచ్ సిరీస్ 6 జీపీఎస్ వేరియెంట్ ధ‌ర రూ.40,900గా ఉంది. అలాగే జీపీఎస్ + సెల్యులార్ వేరియెంట్ ధ‌ర రూ.49,900గా ఉంది. వీటిని అక్టోబ‌ర్ నుంచి విక్ర‌యిస్తారు.

యాపిల్ సంస్థ వాచ్ సిరీస్ 6 యాపిల్ వాచ్‌ల‌తోపాటు కొత్త‌గా వాచ్ ఎస్ఈ పేరిట బ‌డ్జెట్ ధ‌ర‌కే ఓ నూత‌న యాపిల్ వాచ్‌ను కూడా విడుద‌ల చేసింది. వాచ్ సిరీస్ 6ను పోలిన ఫీచ‌ర్లే ఇందులోనూ ఉన్నాయి. కాక‌పోతే ఈ వాచ్ బ‌డ్జెట్ ధ‌ర‌కు ల‌భిస్తుంది. యాపిల్ వాచ్ ఎస్ఈకి చెందిన జీపీఎస్ వేరియెంట్ ధ‌ర రూ.29,900 ఉండ‌గా, జీపీఎస్ + సెల్యులార్ వేరియెంట్ ధ‌ర రూ.33,900గా ఉంది. వాచ్ ఎస్ఈ స్మార్ట్‌వాచ్ కూడా అక్టోబ‌ర్ నుంచే ల‌భిస్తుంది.

యాపిల్ సంస్థ త‌న ఈవెంట్‌లో 8వ జ‌న‌రేష‌న్ ఐప్యాడ్‌ను కూడా లాంచ్ చేసింది. ఇందులో 10.2 ఇంచుల రెటీనా డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. యాపిల్ ఎ12 బ‌యానిక్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 32, 128 జీబీ వేరియెంట్ల‌లో ఈ ఐప్యాడ్ ల‌భిస్తోంది. ఇందులో వినియోగ‌దారుల‌కు ఐఓఎస్ 14 ల‌భిస్తుంది. వెనుక వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా, ముందు వైపు 1.2 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఉన్నాయి. వైఫై, సెల్యులార్ వేరియెంట్ల‌లో ఈ ఐప్యాడ్ అందుబాటులో ఉంది. ట‌చ్ ఐడీ, బ్లూటూత్ 4.2, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, 10 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్లు కూడా ఈ ఐప్యాడ్‌లో ల‌భిస్తున్నాయి.

యాపిల్ ఐప్యాడ్ 8వ జ‌న‌రేష‌న్ సిల్వ‌ర్‌, స్పేస్ గ్రే, గోల్డ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. ఈ ఐప్యాడ్‌కు చెందిన 32జీబీ వైఫై వేరియెంట్ ధ‌ర రూ.29,900 గా ఉంది. అలాగే 128జీబీ స్టోరేజ్ వైఫై వేరియెంట్ ధ‌ర రూ.37,900గా ఉంది. ఇక 32జీబీ వైఫై + సెల్యులార్ వేరియెంట్ ధ‌ర రూ.41,900గా ఉంది. 128జీబీ వైఫై + సెల్యులార్ వేరియెంట్ ధ‌ర రూ.48,900గా ఉంది.

యాపిల్ త‌న ఈవెంట్‌లో ఐప్యాడ్ ఎయిర్ (4వ జ‌న‌రేష‌న్‌)ను విడుదల చేసింది. దీంట్లో 10.9 ఇంచుల రెటీనా ట్రూ టోన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. యాపిల్ ఎ14 బయానిక్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో ఇది ల‌భిస్తోంది. ఇందులోనూ ఐఓఎస్ 14ను అందిస్తున్నారు. వెనుక వైపు 12, ముందు వైపు 7 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఉన్నాయి. వైఫై, సెల్యులార్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తోంది. బ్లూటూత్ 5.0, ట‌చ్ ఐడీ, 10 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఇందులో అందిస్తున్నారు.

ఐప్యాడ్ ఎయిర్ (4వ జ‌న‌రేష‌న్‌) సిల్వ‌ర్‌, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్‌, గ్రీన్‌, స్కై బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఐప్యాడ్‌కు చెందిన 64జీబీ వైఫై వేరియెంట్ ధ‌ర రూ.54,900 గా ఉంది. 256జీబీ వైఫై వేరియెంట్ ధ‌ర రూ.68,900గా ఉంది. అలాగే 64జీబీ వైఫై + సెల్యుల‌ర్ వేరియెంట్ ధ‌ర రూ.66,900 ఉండ‌గా, 256జీబీ వైఫై + సెల్యులార్ వేరియెంట్ ధ‌ర రూ.80,900గా ఉంది. ఈ ఐప్యాడ్‌ను కూడా అక్టోబ‌ర్ నుంచి విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news