ఐఫోన్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. అక్టోబ‌ర్ 13న ఐఫోన్ 12 మోడ‌ల్స్ విడుద‌ల‌..!

-

యాపిల్ ఐఫోన్ ప్రియుల‌కు శుభ‌వార్త‌. సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ త‌న నూత‌న ఐఫోన్ల‌ను విడుద‌ల చేసే తేదీని ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 13వ తేదీన కొత్త ఐఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. అదే రోజు భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10.30 గంట‌ల‌కు యాపిల్ ఈవెంట్ ప్రారంభం కానుంది. దానికి యాపిల్.. హాయ్, స్పీడ్ అనే పేరు పెట్టింది. ఆ ఈవెంట్‌లో యాపిల్ కొత్త ఐఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నుంది.

apple to launch iphone 12 phones on october 13th

ఇక ఐఫోన్ 12 కు గాను మొత్తం నాలుగు మోడ‌ల్స్‌ను యాపిల్ విడుద‌ల చేస్తుంద‌ని తెలిసింది. 5.4 ఇంచుల ఐఫోన్ 12 మినీ, 6.1 ఇంచుల ఐఫోన్ 12, 12 ప్రొ, 6.7 ఇంచుల ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల‌ను యాపిల్ విడుద‌ల చేస్తుంద‌ని స‌మాచారం. ఈ ఫోన్ల‌న్నింటిలోనూ ఓలెడ్ డిస్‌ప్లేల‌ను యాపిల్ అందిస్తుంద‌ని తెలిసింది. వీటికి 5జి స‌పోర్ట్ ల‌భిస్తుంద‌ని తెలిసింది. వీట‌న్నింటిలోనూ యాపిల్ 14 బయానిక్ చిప్‌సెట్‌ను అందివ్వ‌నున్నారు. అందువ‌ల్ల గ‌త ఐఫోన్ మోడ‌ల్స్ క‌న్నా ఈ ఫోన్లు చాలా వేగంగా ప‌నిచేస్తాయి.

కొత్త ఐఫోన్ల‌తోపాటు యాపిల్ త‌న ఈవెంట్‌లో నూత‌న ఎయిర్‌పాడ్స్ ను ఎయిర్‌పాడ్స్ స్టూడియో పేరిట విడుద‌ల చేస్తుంద‌ని తెలిసింది. అలాగే హై ఎండ్ ఓవ‌ర్ ఇయ‌ర్ హెడ్ ఫోన్స్‌ను ఎయిర్ ట్యాగ్స్ పేరిట‌, చిన్న‌పాటి హోం పాడ్‌ను, ఆర్మ్ బేస్డ్ మాక్‌ను కూడా యాపిల్ విడుద‌ల చేస్తుంద‌ని తెలుస్తోంది. యాపిల్ ఈవెంట్‌ను యూజ‌ర్లు అక్టోబ‌ర్ 13వ తేదీన భార‌త కాల‌మానం ప్ర‌కారం 10.30 గంట‌ల నుంచి యాపిల్ సైట్‌లో లేదా యాపిల్ యూట్యూబ్ చాన‌ల్‌లో వీక్షించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news