తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ బస్ భవన్ లో ఇరు రాష్టాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం కానున్నారు. కరోనా కారణంగా ఏడు నెలలుగా ఏపీ, తెలంగాణ అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కిలోమీటర్ల ప్రాతిపదికన అంతర్ రాష్ట్ర బస్సులు నడుపుతామంటున్న ఏపీ, అయితే రూట్ల ప్రాతిపదికన బస్సులు నడపాలంటుంది తెలంగాణ.
రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో ఆ సమస్య ఇప్పుడు జటిలంగా మారింది. కానీ దసరా పండగ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై తాత్కాలిక ఒప్పందానికి ఇరు రాష్టాల అధికారులు సిద్దమైనట్టు తెలుస్తోంది. అదే జరిగితే పండుగకు కొద్ది రోజుల ముందే బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఒకరకంగా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి ఇలా అడ్డు కట్ట వేయచ్చని అధికారులు భావిస్తున్నారు.